కడప నగరపాలక సంస్థ పరిధిలోని పుట్లంపల్లి చెరువు వద్ద ఇవాళ ‘జలధార-జల హారతి’ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి వినియోగం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.