సత్యసాయి :మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో లోకకళ్యాణం కోసం జరిగిన సీతారాముల కళ్యాణంతో పాటు, నిరుపేద కుటుంబాలకు చెందిన 24 జంటలు ఒక్కటయ్యాయి.