ASR: అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 230 అర్జీలు వచ్చాయి. డీఆర్వో లోకేశ్వరరావుతో కలిసి కలెక్టర్ నిశాంతి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సరిహద్దు వివాదాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.