ASR: కొయ్యూరు మండలం బాలారంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాదిరాజు రమణ అనే వ్యక్తి కిరాణా దుకాణం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దుకాణం, సరుకులు, మొత్తం సామాగ్రి కాలి పోవడంతో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే, ఎవరైనా నిప్పు పెట్టారో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నాడు.