VZM: పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఎస్ కోటలో నియోజకవర్గ స్థాయి అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. సేవా రంగంలో అభివృద్ధికి కూడా జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే ఈ రంగం ఊపందుకుంటుందని తెలిపారు.