GNTR: పశ్చిమ టీడీపీ ఆఫీసులో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాలతో దీన్ని నిర్వహించారు. నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పింఛన్లు, ఇళ్లు, ఉపాధి తదితర సమస్యలపై వినతులు ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, ఇతర నేతలు వీటిని స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.