VZM: జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో రెవెన్యూకు సంబంధించి ప్రజా ఫిర్యాదులపై శతశాతం పరిష్కారం కావడం లేదని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఎస్ కోట మండల అధ్యక్షులు ముత్యాల నాయుడు అన్నారు. ఎస్ కోటలో శుక్రవారం మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎంతమంది అర్జీదారుల రెవెన్యూ సమస్యలను పరిష్కరించారో రెవెన్యూ అధికారులు తెలపాలని డిమాండ్ చేశారు.