కృష్ణా: పన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు ఆర్.సీపీ రెడ్డి గుడివాడలో నిన్న విమర్శించారు. 5% రిబేటు అని చెబుతూనే, ఏటా 15% పన్ను పెంచడం ప్రజలపై మోయలేని భారమని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. పెంచిన పన్నులను తక్షణమే తగ్గించాలన్నారు.