KKD: అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండకుండా పూర్తిస్థాయిలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం ప్రకటించారు. దర్శనం, ప్రసాదం, అన్నదానం అంశాలపై అధికారులకు ఆరు నిర్దిష్ట సూచనలు జారీ చేశారు. భక్తులే భగవంతులని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.