GNTR: కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తోంది. ఈ వర్షం ఉద్యోగులు, విద్యార్థులు, చేతివృత్తుల వారికి ఆటంకంగా మారింది. అయితే, ఈ వర్షం మరో రెండు రోజులు కొనసాగితే తమ మాగాణి, మెట్ట పొలాలకు ఎంతో ఉపయోగమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.