VZ: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి చదురగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరిరాట వేశారు. అనంతరం వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్టయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు.