MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వర్షాకాలం సీజన్ కావడంతో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రగతి ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు రక్త పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.