MNCL: విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు. బెల్లంపల్లి మైనారిటీ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సందర్శించారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను సమీక్షించి, సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, అభ్యాసానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు అవసరమైన సూచనలు చేశారు.