PLD: బొల్లాపల్లి మండలం వడ్డేంగుంట గ్రామంలో శుక్రవారం పశు గణాభివృద్ధి, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ చికిత్స కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ వై.సుధాకర్ మాట్లాడుతూ.. పశువుల్లో గర్భకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పశు వైద్యులను సంప్రదించాలని అన్నారు.