కోనసీమ: రాజోలు పట్టణంలో ప్రమాదకరంగా బైకులతో వీరంగం చేస్తున్న యువతపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం నిబంధనలను అతిక్రమించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను సీఐ నరేశ్ కుమార్ అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.