Asia Cup 2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టు 67 పరుగులకే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా (27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.