GNTR: శుక్రవారం ఉదయం బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఢీకొని హైకోర్టు అడ్వకేట్ జనార్ధనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖల బస్సుల అతివేగం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.