BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పరకాల-గంగిరేణి గూడెం ఆర్టీసీ బస్సు రెగ్యులర్గా నడవడం లేదని స్థానికులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా బస్సు సరిగా రాకపోవడంతో నిజాంపల్లి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పరకాల డిపో మేనేజర్ స్పందించి బస్సు సర్వీసు రెగ్యులర్గా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.