TG: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. 2,3 వీలర్స్, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, గూడ్స్ తదితర అన్ని రకాల వెహికల్స్ కచ్చితంగా వీటిని అమర్చుకోవాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.