ASR: ఆటో డ్రైవర్లకు “వాహన మిత్ర” పథకం కింద రూ.15,000 సాయం అందజేస్తామని పామర్రు MLA వర్ల కుమార్ రాజా తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన “P4” ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో డ్రైవర్లు, రోడ్ల పరిస్థితి దారుణమైందని విమర్శించారు.