TG: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగిపోయినట్లు తెలుస్తోంది. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన.. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నట్లు సమాచారం. ఆమె 1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. మొత్తం 106 కేసుల్లో నిందితురాలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సుజాతక్క లొంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.