కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హసన్ నియోజకవర్గంలోని మొసలిహోసహళ్లి గ్రామంలో గణేష్ శోభయాత్ర జరుగుతుండగా ఓ ట్రక్కు వేగంగా భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.