CTR: నగరి మున్సిపాలిటీ KVPR పేట పొన్నియమ్మ గుడి వద్ద జరుగుతున్న గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ముందుగా ఆలయ గర్భగుడిలో పొన్నియమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాకాళి అవతారంలో అలంకరించబడిన ఉత్సవముర్తిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు.