BDK: ANMలపై ఆన్లైన్ వర్క్‌ల పేరుతో పని ఒత్తిడి తగ్గించాలని అశ్వాపురం మండల వైద్య అధికారి సంకీర్తనకు శుక్రవారం ANMలు వినతి పత్రం అందజేశారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ కూడా చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 15న మెడికల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.