ADB: సాత్నాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలను AEE దీపక్ శనివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లకు గాను ప్రస్తుతం 286.00 మీటర్లుగా ఉందన్నారు. నీటి సామర్థ్యం 1.24 TMCలకు ప్రస్తుతం 0.937 TMC ఉందన్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గడిచిన 24 గంటల్లో 1152 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు.