కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ. 20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, 9052259333, 9944922677 సంప్రదించాలన్నారు.