ADB: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు మండలాలలో పర్యటన నిమిత్తం శనివారం బయలుదేరారు. మార్గమధ్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని హోటల్లో స్థానికులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులున్నారు.