యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మూవీ ‘మిరాయ్’. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. దీంతో తేజ కెరీర్లోనే ఇవే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.