SRPT: తిరుమలగిరిలో మాజీ RSS కార్యకర్త, రేషన్ డీలర్ సోమ లక్ష్మయ్య ఇటీవల మరణించారు. ఇవాళ దశదినకర్మ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. లక్ష్మయ్య సేవలు మరవలేనివని ఆమె పేర్కొన్నారు.