RR: విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానిని పూర్తిగా గాలికి వదిలేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ అన్నారు. షాద్నగర్లో మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలన్నారు.