KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వెరైటీ భారీ చేప అతడి కంటపడింది. కాగా, ఇలాంటి చేప ఇప్పటివరకు LMD రిజర్వాయర్‌లో లభించలేదని మత్స్యకారులు తెలిపారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు.