W.G: అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి తాగునీటి చెరువులో పడి మృతి చెందింది. మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనతో చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.