జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జడ్చర్ల పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై కేటీఆర్ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నారు