బాలీవుడ్ నటీనటుల PR టీంలను నటుడు మనోజ్ బాజ్పాయ్ విమర్శించారు. ఎవరికి వారు ట్యాగ్లను జోడిస్తున్నారని, రాత్రికి రాత్రే ఉత్తమ నటుడు, నేషనల్ క్రష్ అనే ట్యాగ్లు వైరల్ అవుతున్నాయని తెలిపారు. ఏదైనా మంచి సినిమాలో గొప్పగా నటించానని అనుకునేలోపే PR టీం వేరే నటుడిని హైలైట్ చేస్తుందన్నారు. దీంతో వారు గుర్తింపు పొందుతున్నారని, ఇది చాలా చిరాకు తెప్పిస్తుందని తెలిపారు.