MNCL: భీమారంలోని శ్రీ కోదండ రామాలయం నూతన ఆలయ కమిటీ ఎన్నిక ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ చేకూర్తి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గ్రామంలోని ప్రతి సామాజిక వర్గం నుంచి ఇద్దరు భక్తులు హాజరై ఛైర్మన్, సభ్యులను ఎన్నుకోవాలన్నారు. నూతన కమిటీ ఆలయ అభివృద్దితో పాటు శ్రీరామ నవమి, గోదాదేవి కల్యాణం, ఇతర ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.