నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఓ భారతీయుడితో పాటు 50 మందికి పైగా మరణించారు. ఈ ఆందోళనల్లో పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి, ఇతర మంత్రులు రాజీనామా చేశారు. ఈ మరణాలపై ఖాట్మండు మేయర్ బాలెన్ షా స్పందిస్తూ, ‘మీ త్యాగాలు దేశంలో మార్పును తెచ్చాయి’ అంటూ మరణించిన వారిని అమరవీరులుగా అభివర్ణించారు.