NLG: పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఆసరా అవుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నియెజకవర్గ పరిధిలోని కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూరు, నార్కెట్ పల్లి పల్లి, చిట్యాల సంబంధించిన 207 మంది లభ్దిదారులకు రూ.73,65,000ల విలువ గల చెక్కులను శనివారం పంపిణీ చేశారు.