AP: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులు జ్వరం బారిన పడుతున్నారు. దీంతో మంత్రి సత్యకుమార్ అప్రమత్తమయ్యారు. జ్వర బాధితులు ఎక్కువ మంది ఉండటంతో బ్లడ్ కల్చర్ చేయిస్తున్నారు. తురకపాలెం లాగే కొత్తరెడ్డిపాలెంలో లక్షణాలు ఉన్నాయని వైద్యులను మంత్రి అప్రమత్తం చేశారు. ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయని చేబ్రోలు సీహెచ్సీ వైద్యురాలు ఊర్మిళ వెల్లడించారు.