ATP: శింగనమల సమన్వయకర్త, మాజీ మంత్రి డా.సాకే శైలజనాథ్ వైరల్ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటీవల జరిగిన “అన్నదాత పోరు” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.