GNTR: గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో రూ. 2.50 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామని MP పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. శనివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్తో కలిసి ఆయన మహిళా కళాశాలను సందర్శించారు. కళాశాలలో ప్రస్తుతం 2,500 మంది విద్యార్థినులు ఉన్నారని, వారి అవసరాలకు అనుగుణంగా కోల్ ఇండియా సహకారంతో ఈ అదనపు గదులను నిర్మిస్తామని తెలిపారు.