కర్నూలు కలెక్టర్ ఛాంబర్లో శనివారం జిల్లా నూతన కలెక్టర్గా ఉదయం 10.40 గంటలకు డా. ఏ.సిరి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్వమత పెద్దలు ప్రార్థనలు నిర్వహించి సిరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.