ప్రకాశం: 39వ కలెక్టర్గా రాజాబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల బదిలీల్లో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో రాజాబాబు నియమితులయ్యారు. కాగా, శనివారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా.. కలెక్టర్కు జిల్లా అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.