SDPT: సిద్దిపేట పట్టణంలో శనివారం జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రూప్-1పై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.