NLG: SLBC సొరంగం పనులలో టీబీఎం పద్ధతిని ప్రభుత్వం రద్దు చేయనుంది. మిగిలిన సొరంగాన్ని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతిలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రమాదాలు, భూగర్భ సమస్యల నేపథ్యంలో ఈ మార్పు చేపట్టబడింది. ప్రభుత్వం 2027 డిసెంబర్ 9 నాటికి 9 కిమీ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తుది నిర్ణయం త్వరలో కేబినెట్ సమావేశంలో తీసుకోనుంది.