MDK: కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులో గల శ్రీ మాత నల్ల పోచమ్మ అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి, పట్టు వస్త్రాలతో అలంకరించి, మంగళహారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి వచ్చారూ.