ATP: మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త శైలజనాథ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ శనివారం సింగనమల పట్టణ కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటమయ్య మాట్లాడుతూ .. శైలజనాథ్ వైరల్ ఫీవర్తో హైదరాబాదులోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు.