MBNR: దేవరకద్ర పట్టణంలో మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం క్షేత్రపాలకుడైన వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శనివారం ఆలయ అర్చకులు నాగరాజు స్వామి తెలిపారు. ఈ నెల 15న సోమవారం రాత్రి నందికొలసేవ, వీరభద్ర సేవ నిర్వహిస్తామన్నారు. అనంతరం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు అగ్నిగుండం ఉంటుందన్నారు.