గుంటూరు శివారులోని జాతీయ రహదారిపై ఉన్న వై-జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీని శనివారం వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో నెల్లూరుకు చెందిన చాంద్ బాషా, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. చాంద్ బాషాతో పాటు అతని భార్య అధిర, కుమారుడు ముస్తఫా కారులో ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.