ATP: తాడిపత్రి పట్టణంలో శనివారం మాజీ మంత్రి కీర్తిశేషులు చల్ల సుబ్బరాయుడి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాజీ మంత్రి కూతురు అమృతవల్లితో కలిసి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చల్ల సుబ్బరాయుడు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.