NLR: ఇండోసోల్ కంపెనీ కోసం మా ఊరును ఖాళీ చేసే ప్రసక్తే లేదని కరేడు పంచాయతీ ఉప్పరపాలెం దళిత కాలనీవాసులు వినూత్నంగా తెలియజేశారు. పంటల పండే భూములను కంపెనీ కోసం ఇచ్చే ఉద్దేశం తమకు లేదని శనివారం ఈ సందర్భంగా తెలియజేశారు. ఇండోసోల్ వద్దు మా గ్రామాన్ని విచ్ఛిన్నం చేయొద్దు అంటూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని, ఇండోసోల్ కంపెనీ రద్దు చేయాలని కోరారు.